![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 మూడో వారానికి వచ్చేసింది. ఇక నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్స్ ఓటింగ్ ఏంటి.. అసలు ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. మరి ఫస్ట్ టూ వీక్స్ లో బయటకు వెళ్తుందనుకున్న ఫ్లోరా సైనీ ఈ వారం వెళ్తుందా లేదా కామనర్స్ నుండి ఒకరు వెళ్తారా ఓసారి చూసేద్దాం.
ఈవారం నామినేషన్స్‌లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ప్రియా శెట్టి, రీతూ చౌదరి, పవన్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్ హరీష్, రాము రాథోడ్, ఫ్లోరా సైనీ.. ఈ ఆరుగురు నామినేషన్స్‌లో ఉండగా ఫ్లోరా సైనీ 30 శాతం ఓట్లతో అందరికంటే ముందున్నది. ఆ తరువాత స్థానంలో 25 శాతం ఓట్లతో రాము రాథోడ్ ఉన్నాడు. దాదాపు మెజారిటీ ఓట్లన్నీ ఈ ఇద్దరే పంచేసుకుంటున్నారు. ఇక మూడో స్థానంలో మాస్క్ మ్యాన్ హరీష్ 20 శాతం ఓట్లతో ఉన్నాడు. పవన్ కళ్యాణ్‌కి 10 శాతం ఓట్లు పడుతుంటే.. రీతూ చౌదరికి 8 శాతం ఓట్లు పడుతున్నాయి. ఇక ప్రియశెట్టికి కేవలం 3 శాతం ఓట్లు మాత్రమే పడుతున్నాయి. తొలిరోజు ఓటింగ్‌ని బట్టి చూస్తే.. ప్రియ శెట్టి ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.
కామనర్స్ ని బయటకు పంపించేయ్యాలని బిబి ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పెద్దగా ఎంటర్‌టైన్‌మెంట్ ఏం ఇవ్వడం లేదు.. పైగా ఎంటర్ టైన్ చేసేవాళ్ళని క్రింజ్ కామెడీ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందుకే వీరిని వీలైనంత త్వరగా బయటకు పంపించెయ్యాలంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఈ వారం కామనర్స్ లో నుండి ఎవరు ఎలిమినేషన్ అవుతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
![]() |
![]() |